Today OTT Movies: ఇండియా టాప్ ఓటీటీకి వచ్చేసిన 4 కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే

Today OTT Movies: ఇండియా టాప్ ఓటీటీకి వచ్చేసిన 4 కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే

ఈ వారం  (2025 NOV 14న) ఓటీటీలోకి తెలుగు నుంచి రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చాయి. అయితే, గత వారాలకు భిన్నంగా, ఈ సారి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ అండ్ కోర్ట్ డ్రామా సినిమాలు ఓటీటీకి రావడం విశేషం. అందులో తెలుగు నుంచి తెలుసుకదా, డ్యూడ్ సినిమాలు ఉండగా, హిందీ నుంచి జాలి LLB 3 (నవంబర్14న, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (నవంబర్13న) మూవీస్ ఉన్నాయి. అయితే, ఈ నాలుగు సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రావడం ఇక్కడ మరింత ఆసక్తి కలిగేలా చేస్తోంది.

సాధారణంగా.. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సినిమా వస్తుందంటే.. ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండాలి. ఇది నెట్‌ఫ్లిక్స్ స్పెషల్. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత. అలాంటి నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన లేటెస్ట్ ఆ నాలుగు సినిమాలేంటీ? ఎలాంటి కథతో వచ్చాయి? అనేది చూసేద్దాం. 

తెలుసు కదా ఓటీటీ (Telusu Kada):

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'తెలుసు కదా'.  అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుని ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నీరజ్ కోనా డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 14న) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. 

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ..

దర్శకురాలు నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ), అంజలి (రాశీ ఖన్నా)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అతడు తన మాజీ ప్రేయసి అయిన రాగ (శ్రీనిధి శెట్టి)ను ఎదురవుతుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని, చిక్కుముడులు విడదీయలేని విధంగా మారడం ఈ సినిమా ప్రధానాంశం.

డ్యూడ్ ఓటీటీ (DudeOTT): 

తమిళ యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథన్, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'డ్యూడ్' (Dude). దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

'లవ్ టుడే' (Love Today), 'గుడ్ నైట్' (Good Night) లాంటి భారీ విజయాల తర్వాత, ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా మూడవ రూ.100 కోట్ల సినిమాగా 'డ్యూడ్' నిలిచింది. ఇపుడు ఈ సూపర్ హిట్ చిత్రం కూడా శుక్రవారం (నవంబర్ 14) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. 

సందేశం, వినోదం మేళవింపు..

'డ్యూడ్' కేవలం కామెడీ, రొమాన్స్ మాత్రమే కాక, కులాంతర వివాహాలు, పరువు హత్యలు వంటి సున్నితమైన సామాజిక అంశాలతో పాటు యువతను ఆలోచింపజేసే బలమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను పలికించడంలో చూపిన నైపుణ్యం ప్రేక్షకులను కట్టిపడేసింది.

కథాంశం..

దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన 'డ్యూడ్' కథాంశం అగన్ (ప్రదీప్), కురళ్ (మమితా బైజు) అనే ఇద్దరు బాల్య స్నేహితులు చుట్టూ తిరుగుతుంది. వీరు కలిసి 'సర్ ప్రైజ్ డ్యూడ్' అనే ఈవెంట్ ప్లానింగ్ కంపెనీని నడుపుతుంటారు. వీరి స్నేహం, అనుబంధం బలపడిన తర్వాత, ఊహించని విధంగా కురళ్, అగన్‌కు తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. మొదట్లో తిరస్కరించిన అగన్, తర్వాత తన ప్రేమను తెలుసుకుని ఆమె తండ్రిని ఒప్పించడానికి వెళ్తాడు.

అయితే, కథ ఇక్కడి నుంచే ఊహించని మలుపులు తిరుగుతుంది. కురళ్ తండ్రి, శక్తివంతమైన మంత్రి అథియమాన్ అళగప్పన్ (ఆర్. శరత్ కుమార్), వివాహానికి వెంటనే అంగీకరించినా, ఆ తర్వాత వెలుగులోకి వచ్చే కుటుంబ రహస్యాలు కథను ఉత్కంఠగా మారుస్తాయి.

ముఖ్యంగా, అథియమాన్ తన చెల్లెలిని కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపినట్లు వెల్లడించడం, రాజకీయ పలుకుబడి కోసం ఆ నేరాన్ని దాచడం వంటి చీకటి కోణాలు బహిర్గతమవుతాయి. కురళ్ మరొకరిని ప్రేమించడంతో, ఆ రెండు జంటల జీవితాలు , మంత్రి అథియమాన్ కఠినమైన పరువు హత్యల సిద్ధాంతం చుట్టూ కథనం అద్భుతంగా నడుస్తుంది.

‘జాలి LLB3’ OTT:

అక్షయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించిన బ్లాక్‌బస్టర్ లీగల్ కామెడీ ‘జాలి LLB3’ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఒకేసారి రెండు ఇండియా దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో అందుబాటులో ఉంది. Netflix (నెట్‌ఫ్లిక్స్) మరియు JioHotstar (జియో హాట్ స్టార్)లో ఇవాళ (నవంబర్ 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.  

రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా న్యాయం కోసం జరిగే ఓ పోరాటం. ఇందులో రాజకీయాలు, సామాజిక సమస్యలపై చర్చిస్తూనే ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ఇద్దరూ న్యాయవాదులుగా అద్భుతంగా నటించారు. కోర్టులో వీళ్లిద్దరి మధ్య సాగే వాదోపవాదాల నేపథ్యంలో సాగే డబుల్ ట్రబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెడీతో, ఆలోచింపజేస్తూనే నవ్వులు పూయించారు. జడ్జి పాత్రలో సౌరబ్ శుక్లా ఆకట్టుకుంటారు. మరో అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అన్ను కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషించి మెప్పిస్తుంది.

కథేంటంటే:

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఒక ధనవంతుడైన పారిశ్రామికవేత్తకు.. వ్యతిరేకంగా స్థానిక రైతులు చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది.  ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరిభాయ్ (గజరాజ్) రాక్షస ప్రయత్నాన్ని ఆ ఊరి వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు.

ఈ క్రమంలో ఓ పేద రైతు రాజారామ్ సోలంకి దగ్గర నుండి వ్యాపారి హరిభాయ్ బలవంతంగా తన భూమిని స్వాధీనం చేసుకుంటాడు. దాంతో రాజారామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. భూమి పత్రాలు ఫోర్జరీ అయ్యాయని రైతు కోడలు జానకి వాదించినా పట్టించుకోరు.

అలా ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండడంతో రకరకాల మతలబులు చేసి అందరీ భూములను దక్కించుకుంటాడు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారికి.. ఇద్దరు జాలీలు (అక్షయ్, అర్షద్) కలిసి ఎలా సహాయపడ్డారు? అందుకోసం వారు ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది “జాలీ ఎల్.ఎల్.బి 3” కథ. 

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (Delhi Crime: Season 3):

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (Delhi Crime: Season 3) నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా కంటెంట్ తీసుకురావడం ఈ ఢిల్లీ క్రైమ్ సిరీస్ ప్రత్యేకత. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. అమ్మాయిల అక్రమ రవాణా చుట్టూ తిరిగే కథలా సీజన్ 3 వచ్చింది. ఇందులో షెఫాలీ షాతోపాటు హుమా ఖురేషీ, రసికా దుగల్, రాజేష్ తైలాంగ్ నటించారు.

ఢిల్లీ క్రైమ్ సీజన్ 1:

2012లో భారతదేశాన్ని కదిలించిన నిర్భయ రేప్ కేసు ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2019లో వచ్చింది.

ఢిల్లీ క్రైమ్’ సీజన్ 2:

2022లో DCP వర్తిక చతుర్వేది నేతృత్వంలోని పోలీసు బృందం నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక నేర సిండికేట్‌ను ఎలా ఛేదిస్తుందో వివరిస్తుంది. అంటే.. కచ్చా బనియన్ గ్యాంగ్ ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంట్లోని ఒంటరి ముసలివాళ్లనే లక్ష్యంగా చేసుకొని వాళ్లు చేసే దాడులు, కేసు ఎలా పరిష్కారమైందన్నది చూపించారు. మొత్తం ఈ రెండు సీజన్లలో 12 ఎపిసోడ్లు వచ్చాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.