యానిమల్ మూవీ ధియేటర్లపై కొత్త రచ్చ.. పార్లమెంట్ ఇష్యూతో గందరగోళం

యానిమల్ మూవీ ధియేటర్లపై కొత్త రచ్చ.. పార్లమెంట్ ఇష్యూతో గందరగోళం

యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ సంచనల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా ఆమె యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్న తన కూతురు యానిమల్ సినిమాకు వెళ్లి ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిందని, సినిమాలో హింసా, మహిళలపై వేధింపులు వంటి సన్నివేశాలు తప్పా ఏమీ లేవని, యానిమల్ సినిమాను ఒక బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపిస్తూ పార్లమెంట్ లో మండిపడ్డారు రంజీత్ రంజన్. దీంతో ఈ ఇష్యు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ విషయంలో రంజీత్ రంజన్ ఫై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కారణం.. యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేయడమే. A సర్టిఫికెట్ అంటే 18 ఏళ్ళ లోపు పిల్లలు ఈ సినిమా చూడాటానికి వీలులేదు. రంజీత్ రంజన్ కూతురు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు. అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు 16, 17 ఏళ్ళ వయసుండే ఆవకాశం ఉంది. అలాంటప్పుడు.. ఆమె యానిమల్ సినిమాకు ఎలా వెళ్లారు. 

వెళ్లినా.. థియేటర్ లో ఆమెకు టికెట్ ఎలా ఇచ్చారు. ఒకేవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకుంటే.. A సర్టిఫికెట్ అని మెన్షన్ చేసిన సినిమా టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు. మీకు నిజంగా కోపం ఉంటే.. టికెట్ ఇచ్చిన థియేటర్ వారిపైనా.. లేదా A సర్టిఫికెట్ అని తెలిసి కూడా సినిమాకు వెళ్లిన మీ కూతురిపై ఉండాలి. మధ్యలో యానిమల్ మేకర్స్ ఎం చేశారు. వాళ్ళు వాళ్ళ సినిమాను నిబంధనలకు లోబడి, అన్నీ కండీషన్స్ ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తెప్పేమి లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యానిమల్ మూవీపై జరుగుతున్న ఈ కొత్త రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.