హెచ్సీఏ తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు 

హెచ్సీఏ తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు 

జింఖానా గ్రౌండ్స్ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషళ్ మీడియా వేదికగా HCAపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా మారేందుకు HCA వైఖరే కారణమంటూ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయం విషయంలో దారుణంగా విఫలమైన HCAపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. shame HCA, Rip HCA హ్యాష్ ట్యాగ్లతో  అజారుద్దీన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 

జింఖానా గ్రౌండ్ వద్ద పరిస్థితిని సమీక్షించాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. డిజిటల్ యుగంలో టికెట్లను ఆన్ లైన్లో పెట్టకుండా ఆఫ్ లైన్లో అమ్ముతూ ఇంత మంది గాయాలపాలయ్యేలా చేయడమేంటని ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్స్ ఘటన అనంతరం భవిష్యత్తులో మరే మ్యాచ్ నిర్వాహణకు HCAకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు జింఖానా గ్రౌండ్స్ వద్ద తమ టికెట్లను కలెక్ట్ చేసుకోవడం సాధ్యమేనా అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు.