బిగ్బాస్​ బ్యూటీపై ప్రేక్షకులు గరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

బిగ్బాస్​ బ్యూటీపై ప్రేక్షకులు గరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

నిన్నటి బిగ్బాస్(Bigg Boss) ​ఎపిసోడ్​ సీరియల్​బ్యూటీ శోభా శెట్టి(Shobha Shetty) కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఇప్పటిదాకా తన డేరింగ్​యాటిట్యూడ్​తో ఓకే అనిపించుకున్న శోభా..ఓవర్​ యాక్టింగ్​కారణంగా నెగిటివ్ రెస్పాన్స్​ తెచ్చుకుంటోంది.

నిన్నటి ఎపిసోడ్లో(అక్టోబర్ 12) ఎవరు స్మార్ట్​ అనే టాస్క్లో అత్యుత్సాహం ప్రదర్శించింది. శోభ తీరును తప్పుపడుతూ పూజా రామస్వామి మండిపడింది. తను చెప్తే నీతులు..ఎదుటివారు చెప్తే బూతులా అంటూ స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. ఇక ఆ సామెతకు మీనింగ్​ తెలుసుకుని శోభా గుక్కపెట్టి ఏడ్చేసింది. తనను అంత మాట అంటుందా అంటూ ఆవేదన వెల్లగక్కింది. ఇక మిగతా కంటెస్టెంట్స్​తో తరచూ కయ్యానికి కాలు దువ్వుతూ శోభా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఆమె తీరు ఇలాగే కొనసాగితే ఓటింగ్​కూడా తనను కాపాడలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బిగ్​బాస్​ లవర్స్​. 

ఈ లేటెస్ట్ సీజన్‌లో బిగ్బాస్ కంటెస్టెంట్స్‌కు..ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంది. ఇంతకు ముందులా లేదు. ఇంట్లో తనకు నచ్చిన ఒకే ఒక్క సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలనేది కండీషన్. ఆ ఓటు కూడా హాట్ స్టార్ యాప్ నుంచే మాత్రమే ఈ వేయాల్సి ఉంటుంది. అలాగే ఒక మిస్ట్ కాల్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో..హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాల్గోవ వారంలో బ్యూటీ రతిక ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా శుభశ్రీ ఇంటి నుంచి ఎలిమినేట్ కాగా..ఐదో వారంలో మరో ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ కి పిలిచారు. ప్రసెంట్ ఆరో వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.