కొత్త ఏఐ టెక్నాలజీ..కంటిచూపుతో కంట్రోల్ చేసేలా..డ్రైవర్​ లేకుండానే కారు నడపొచ్చు

కొత్త ఏఐ టెక్నాలజీ..కంటిచూపుతో కంట్రోల్ చేసేలా..డ్రైవర్​ లేకుండానే కారు నడపొచ్చు

ఫోన్​, కారుని కంటిచూపుతో కంట్రోల్ చేసేలా కొత్త ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీతో డ్రైవర్​ లేకుండానే కారు నడపొచ్చు. ఫోన్​ ఆన్​ చేసి కంటిచూపుతో ఆపరేట్​ చేయొచ్చు. 

బార్సిలోనాలో మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్​లో టెక్ కంపెనీలు తయారుచేసిన వెరైటీ ఫోన్లను పరిచయం చేశాయి. వాటిలో ‘ఆనర్ కంపెనీ’ తయారుచేసిన ఫోన్​ స్పెషల్ ఫీచర్స్​తో బాగుంది అనిపించింది. ఇప్పటివరకు ఫోన్ ఆపరేట్ చేయాలంటే టైపింగ్​, వాయిస్ అసిస్టెంట్​ ఫెసిలిటీ ఉంది. అయితే, ఇప్పుడు వాటికి మించి, కంటిచూపుతో ఆపరేట్​ చేసేలా ఈ టెక్నాలజీని డిజైన్ చేసింది కంపెనీ.  

‘మ్యాజిక్​ 6 ప్రొ’ పేరుతో ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఫోన్స్​ తయారు చేసింది. ఈ ఫీచర్​ వాడేందుకు సింపుల్​గా ఫోన్ ఆన్ చేసి, దానివైపు చూస్తే చాలు.. కంటిపాప ఎటువైపు ఫోకస్​ చేస్తే అక్కడ ఉన్న దాన్ని ఫోన్ యాక్టివేట్ చేస్తుంది. ఉదాహరణకు ఫోన్​ కాల్​ వచ్చినప్పుడు ఫోన్​ స్క్రీన్​ మీద ఉన్న ఆకుపచ్చ రంగు ఫోన్ బొమ్మను చూస్తే ఫోన్ లిఫ్ట్​ చేస్తుంది. ఎరుపు రంగు వైపు చూస్తే కాల్ కట్ చేస్తుంది. అంతేకాదు.. దీనిద్వారా మొబైల్ షాపింగ్, కార్​ కూడా కంట్రోల్ చేయొచ్చు!