పెరిగిన జీవిత బీమా పాలసీలు.. అక్టోబర్ లో కొత్త బిజినెస్ ప్రీమియాల విలువ రూ.34 వేల కోట్లు

పెరిగిన జీవిత బీమా పాలసీలు.. అక్టోబర్ లో  కొత్త బిజినెస్ ప్రీమియాల విలువ రూ.34 వేల కోట్లు
  •     గత నెలకొత్త బిజినెస్​ ప్రీమియాల విలువ రూ.34 వేల కోట్లు

న్యూఢిల్లీ: భారతదేశ జీవిత బీమా రంగం వరుసగా రెండో నెలలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గత నెల కొత్త బిజినెస్​ ప్రీమియాల విలువ ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి రూ. 34,007 కోట్లకు చేరుకుందని కేర్​ఎడ్జ్​ రేటింగ్స్​ తెలిపింది.  లైఫ్​ ఇన్సూరెన్స్​ కౌన్సిల్,  ఐఆర్​డీఏఐ నుంచి ఈ వివరాలు సేకరించినట్టు ప్రకటించింది.  ఈ ఏడాది ఆగస్టులో ప్రీమియాలు విలువ 5.2 శాతం తగ్గగా,  గత నెల భారీగా పెరిగింది. 

ముఖ్యంగా ఇండివిడ్యువల్​ సెగ్మెంట్​, నాన్-సింగిల్​ ప్రీమియం పాలసీలు భారీగా అమ్ముడయ్యాయి.  ఇండివిడ్యువల్​ జీవిత బీమా ఉత్పత్తులపై జీఎస్​టీ తగ్గింపు నిర్ణయం కూడా బీమా కంపెనీలకు మేలు చేసింది.  ప్రభుత్వ రంగ సంస్థ ఎల్​ఐసీ మొదటిస్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రైవేట్​ బీమా కంపెనీలు కూడా రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇండివిడ్యువల్,​ నాన్-సింగిల్​ పాలసీల నుంచి ప్రీమియం భారీగా పెరిగింది. 

ఎస్​ఎల్​ఐసీ కొత్త బిజినెస్​ ప్రీమియం 17 శాతం వృద్ధి       
                    
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్​ (ఎస్​ఎల్​ఐసీ) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో (హెచ్​1)లో ఇండివిడ్యువల్​ కొత్త బిజినెస్​ ప్రీమియం (ఎన్​బీపీ)లో ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధి సాధించింది. గత హెచ్1లో ఇది  రూ. 542 కోట్లు ఉండగా,  2026 ఆర్థిక సంవత్సరం హెచ్​1లో రూ. 635 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో ప్రైవేట్​ రంగం 8 శాతం వృద్ధి చెందింది. రెన్యువల్​ ప్రీమియాలు  2026 ఆర్థిక సంవత్సరం హెచ్​1లో 43 శాతం పెరిగాయి. క్లెయిమ్ సెటిల్‌‌మెంట్ నిష్పత్తి 2025 ఆర్థిక సంవత్సరానికి 98.31 శాతంగా ఉంది.  2026 హెచ్1లో కంపెనీ 37,850 ఇండివిడ్యువల్  గ్రూప్ పాలసీలను సెటిల్ చేసింది. ఎస్​ఎల్​ఐసీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) విలువ సెప్టెంబర్ నాటికి రూ. 14,187 కోట్లకు చేరింది.