అమెజాన్​పై రూ. లక్ష ఫైన్

అమెజాన్​పై రూ. లక్ష ఫైన్

క్వాలిటీ లేని ప్రెజర్‌‌ కుకర్లు అమ్మినందుకే సీసీపీఏ ఆదేశం

న్యూఢిల్లీ: తక్కువ క్వాలిటీ ప్రెజర్​ కుకర్లు​ అమ్మినందుకు అమెజాన్​పై  సెంట్రల్​ కన్జూమర్​ ప్రొటెక్షన్​ అథారిటీ (సీసీపీఏ) రూ. లక్ష ఫైన్​ విధించింది. తన ప్లాట్​ఫామ్​ ద్వారా అమ్మిన మొత్తం 2,265 కుకర్లను వెనక్కి పిలిపించమని కూడా అమెజాన్​ను ఆదేశించింది. కొన్న వారికి ఆ డబ్బును తిరిగి చెల్లించమని సీసీపీఏ ఆదేశించినట్లు కన్జూమర్​ ఎఫెయిర్స్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, పేటీఎం మాల్​, షాప్​క్లూస్​, శ్నాప్​డీల్​ వంటి ఇతర ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్స్​తోపాటు, వాటిపై ప్రెజర్​ కుకర్లను అమ్ముతున్న సెల్లర్లపైనా చర్యలను సీసీపీఏ తీసుకుంటోంది. కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్​ లేకపోవడమే దీనికి కారణమని సీసీపీఏ వెల్లడించింది.

సీసీపీఏ ఇచ్చిన నోటీసుకు అమెజాన్​ సమాధానం పంపించింది. ఈ సమాధానంలోనే 2,265 ప్రెజర్​ కుకర్లను అమ్మినట్లు కంపెనీ వివరించింది. వాటి అమ్మకం ద్వారా అమెజాన్​కు మొత్తం రూ. 6,14,825 రెవెన్యూ వచ్చింది. ఈ ప్రెజర్​ కుకర్ల అమ్మకంపై తనకు సేల్స్​ కమీషన్​ ఫీ వచ్చినట్లు అమెజాన్​ తెలిపింది. దీంతో పెనాల్టీ చెల్లించాలని సీసీపీఏ ఆదేశించడంతోపాటు, 45 రోజులలోపు కంప్లయెన్స్​ రిపోర్టు పంపించమనీ కోరింది. కన్జూమర్ల ప్రొటెక్షన్​ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెబుతూ, ఇటీవలే ఆయుర్వేదిక్​, సిద్ధ, యునాని ఔషధాలను ఆన్​లైన్​లో అమ్ముతున్న ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్స్​కు గైడ్​లైన్స్​ జారీ చేసినట్లు సీసీపీఏ పేర్కొంది. తప్పు దారి పట్టించే అడ్వర్టైజ్​మెంట్లపైనా దృష్టి పెడుతున్నట్లు వెల్లడించింది.