ఎయిర్​ హోస్టెస్​లకు కొత్త డ్రెస్​

ఎయిర్​ హోస్టెస్​లకు కొత్త డ్రెస్​

ఫ్లయిట్​లోకి అడుగు పెట్టినవాళ్లని నవ్వుతూ పలకరిస్తారు ఎయిర్​హోస్టెస్​లు. స్కర్ట్, హైహీల్స్​ వేసుకుని ప్యాసింజర్లని విష్​ చేస్తారు. అయితే, వాళ్ల నవ్వు ముఖం వెనుక కన్నీళ్లని, నొప్పిని దిగమింగిన రోజులు చాలా ఉంటాయి. ‘‘కొన్ని జాబ్స్​కి యూనిఫామ్​ తప్పనిసరి. ఆ జాబ్​ చేసేవాళ్లకి, ముఖ్యంగా ఎక్కువ టైం పనిచేసేవాళ్లకి ఆ యూనిఫామ్​ కంఫర్ట్​గా ఉండేలా చూడడం యజమాన్యం బాధ్యత’’ అంటోంది ఉక్రేన్​లోని బడ్జెట్​ ఎయిర్​లైన్​ స్కైఅప్​ యాజమాన్యం. అనడమే కాదు... క్యాబిన్​ క్రూలో పనిచేసే ఆడవాళ్లు స్కర్ట్, హైహీల్స్​ వేసుకోవద్దని చెప్పేసింది కూడా. ఎయిర్ ​హోస్టెస్​లుగా ట్రైనింగ్​ తీసుకునేవాళ్లు ఇక నుంచి కంఫర్ట్​గా ఉండే ట్రౌజర్ సూట్లు వేసుకోవచ్చని కొత్త రూల్​ తెచ్చింది. ‘స్కైఅప్​ ఎయిర్​లైన్స్’ అనేది ఉక్రేన్​లోనే పెద్ద ఎయిర్​లైన్స్​. యూరప్​లోనే తక్కువ ఖర్చుతో ఫ్లయిట్​ జర్నీ  ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చే ఎయిర్​లైన్​ కూడా. ఈ మధ్య వీళ్లు క్యాబిన్ క్రూ సర్వే చేశారు. హై హీల్స్​, పెన్సిల్​ స్కర్ట్​, టైట్ బ్లౌజ్​ వేసుకుని డ్యూటీ చేయడం మహిళా ఉద్యోగులకి ఇబ్బందిగా ఉందని ఆ సర్వేలో తేలింది. దాంతో, యూనిఫామ్​ మార్చేస్తున్నట్టు చెప్పారు. ఇదేకాక బ్రిటన్​లోని ‘వర్జిన్​ ఎయిర్​లైన్’​ ఎయిర్​హోస్టెస్​లకి మేకప్​ లేకున్నా డ్యూటీకి రానిస్తోంది. జపాన్​ ఎయిర్​ లైన్స్ కూడా ఉమెన్​ ఎంప్లాయిస్​  హైహీల్స్, పెన్సిల్​కట్​ స్కర్ట్​ వేసుకోకున్నా పర్లేదని చెప్పేసింది. 


‘‘రాజధాని కీవ్ నుంచి జంజిబర్​కి, జంజిబర్ నుంచి కీవ్​కి రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇది మొత్తం పన్నెండు గంటలు పడుతుంది. నిల్చొనే డ్యూటీ చేయాలి. అందులో నాలుగ్గంటలు సెక్యూరిటీ చెకింగ్, క్లీనింగ్ ఉంటాయి. అన్ని గంటలు నిల్చున్న తర్వాత నడవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. మా కొలిగ్స్​లో చాలామంది పొడాలజిస్ట్ (​కాళ్ల, చేతివేళ్ల స్పెషలిస్ట్​)ని కలుస్తుంటారు. ఎక్కువ సేపు హైహీల్స్​ వేసుకుని డ్యూటీ చేయడం వల్ల వాళ్ల పాదాలు, కాలి వేళ్లు తరచుగా దెబ్బతింటాయి ”అని చెప్పింది ‘స్కైఅప్​ ఎయిర్​లైన్స్’లో  ఎయిర్​హోస్టెస్​గా పనిచేస్తోన్న​ దరియా సోలొమెన్నయా.