ఏప్రిల్​ 1 నుంచి కొత్త రూల్స్​ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు.. 

ఏప్రిల్​ 1 నుంచి కొత్త రూల్స్​ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు.. 

ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(New Financial Year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త ఆర్థిక  సంవత్సరం ప్రారంభమైన   ఏప్రిల్1, 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి. ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త పన్ను విధానం

పన్ను ( Tax) చెల్లించాల్సి ఉండి చెల్లించకపోతే కష్టాలు తప్పవు.  ఎందుకంటే ఏప్రిల్​1, 2024 నుంచి కొత్త పన్ను విధానం అమలు కాబోతుంది.  New Tax విధానంలో డిఫాల్ట్​ పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది.  దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు పన్ను కట్టకపోతే ఆటోమేటిక్ విధానంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read:కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!

 Fastag   KYC అప్‌డేట్

ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి. నేషనల్​ హైవే(NH)లపై టోల్​ గేట్​ దగ్గర వాహనాల నుంచి టోల్​ గేట్​ ఫీజు వసూలు చేస్తారు. పండుగల సమయంలో టోల్​ గేట్​ వద్ద వాహనాలు బారులు తీరడంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి.  ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం  Fastag  విధానాన్ని అమలు చేసింది.  మార్చి 31, 2024లోపు Fastag KYCని అప్‌డేట్ చేయకుంటే, మీరు వచ్చే నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.   KYC లేకుంటే బ్యాంకులు ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేస్తున్నాయి. అంటే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా KYCని అప్‌డేట్ చేయకుంటే  దాని ద్వారా చెల్లింపు జరగదు. కావున వాహనాలున్న వారు ఫాస్టాగ్ KYCని అప్‌డేట్ చేయించుకోవాలి. 

EPFO కొత్త రూల్

EPFO నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. వాస్తవానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. ఈ నియమం ప్రకారం ఎంప్లాయ్ ఉద్యోగం మారిన తర్వాత PF ఖాతా ఆటో మోడ్‌లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి.

SBI క్రెడిట్ కార్డ్

SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్​  చెల్లిస్తే , ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.