సూపర్ బైక్.. హీరో 160R వచ్చేసింది.. రూ. లక్షా 27 వేలు

సూపర్ బైక్.. హీరో 160R వచ్చేసింది.. రూ. లక్షా 27 వేలు

ఆల్-న్యూ Hero Xtreme 160R బైక్ ను భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ సరికొత్త  బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో మార్కెట్ లో పరుగులు పెట్టడానికి సిద్దంగా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, తేలికపాటి నిర్మాణం  వినూత్న ఫీచర్లతో, హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ ఇండియన్  మార్కెట్లో అమ్మకాలకు  సిద్ధంగా ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ 160 ఆర్‌ రిలీజ్ 

హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు దేశంలో సరికొత్త  హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ 160 ఆర్‌ని విడుదల చేసింది. దీని ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై రూ. 1.36 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.ఈ బైక్ డిజైన్ ను  అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. Xtreme 160R 4V 3 వేరియంట్‌లలో అందించబడుతుంది .  స్టాండర్డ్, కనెక్ట్ చేయబడిన మరియు ప్రో  బైక్ కోసం బుకింగ్‌లు రేపు  ( జూన్ 18) ప్రారంభమయి .. జూలై రెండో  వారంలో డెలివరీలు  కానున్నాయి.

4.7 సెకన్లలో 60 kmph speed

Xtreme 160R  బైక్ లో   ఆయిల్-కూల్డ్ ఇంజిన్ విభాగం తేలికైన మోటార్‌సైకిల్‌గా  ఉంటుంది.  ఈ  బైక్ కేవలం 4.7 సెకన్లలో 60 kmph వేగాన్ని సాధించేలా చేస్తుంది. Xtreme 160R కొత్త 163cc ఎయిర్ &  ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అమర్చారు.   ఇది 8500rpm వద్ద 16.9 bhp ,  6500rpm వద్ద 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. TVS Apache RTR 160 4V  తరగతిలో అత్యంత శక్తివంతమైన బైక్‌గా..17.6 bhpని కలిగి ఉంది.

అదిరే ఫీచర్స్

డిజైన్ పరంగా, కొత్త Xtreme 160R ముందు పొజిషన్ ల్యాంప్‌తో LED హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. వాహనం వెనుక భాగంలో LED వింకర్‌లతో పాటు LED టెయిల్ లైట్‌ ఉంది.  బైక్ పొడవు 2029mm, వెడల్పు 793mm , ఎత్తు 1052mm. ఈ కొత్త బైక్ కు 1333mm వీల్‌బేస్‌ కూడా వస్తుంది. సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ప్రీమియం స్ప్లిట్ సీటును కలిగి ఉంది. సీటు ఎత్తు 795 మిమీ. 144కిలోల (కెర్బ్ వెయిట్) బరువుతో, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ తన సెగ్మెంట్‌లో అత్యంత తేలికైన మోటార్‌సైకిల్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. Xtreme 160R 4Vలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం  వలన నావిగేషన్ , కాల్ నోటిఫికేషన్‌లు ,  SMS అలర్ట్‌లు వంటివి అనేక  ఫీచర్‌లు ఉన్నాయి.

బ్రేక్ సిస్టమ్ ఎలా ఉందంటే...

బైక్ ముందు భాగంలో KYB నుండి పొందిన 37mm USD ఫోర్క్‌లను కలిగి ఉంటుంది, వెనుక భాగంలో 7 దశల ప్రీలోడ్ సర్దుబాటు సామర్థ్యంతో షోవా మోనోషాక్ ను అమర్చారు.  బ్రేక్‌ల విషయానికొస్తే, బైక్‌కు ముందుభాగంలో  276ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేక్ , వెనుక భాగంలో 220ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.