ఈ వారం (మే 11 నుంచి 17) మధ్య కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. విభిన్న కథలు, డిఫరెంట్ జానర్లతో పలు కొత్త సినిమాలు, వెబ్ కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని స్ట్రెయిట్ సినిమాలు రానుండగా, తమిళం, హిందీ భాషల నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా ఈ వారం దాదాపు 15కి పైగా సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుండటంతో ఆడియన్స్ కి మంచి ట్రీట్ అనే చెప్పుకోవాలి.
ఇక థియేటర్ల విషయానికి వస్తే.. సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘పతి పత్నీ ఔర్ వో దో’ చిత్రాలు మే 15న విడుదల కానున్నాయి. మొత్తంగా ప్రేక్షకులకు మే సెకండ్ వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా మారబోతోంది.
ఆహా
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు విలేజ్ థ్రిల్లర్ )- మే 15
జియో హాట్‌స్టార్
ది పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్)- మే 12
తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- మే 12
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్)- మే 15
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) - మే 15
నెట్‌ఫ్లిక్స్
ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 13
నెమిసిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 14
సోల్‌మేట్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 14
ధురంధర్ 2 (హిందీ సినిమా)- మే 15 (ఓవర్సీస్ రిలీజ్)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ)- మే 15
బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15
మార్టిన్, లైఫ్ ఈజ్ షార్ట్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 15
ది క్రాష్ (డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
►ALSO READ | బాక్సాఫీస్ వద్ద జార్జ్‌కుట్టి మైండ్ గేమ్.. 'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత.. బాలీవుడ్‌లో వేరే లెవెల్ ప్లాన్!
అమెజాన్ ప్రైమ్
ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 13
ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- మే 15
సన్ నెక్ట్స్
కాళిదాస్ 2 (తమిళ మూవీ)- - మే 12
జీ5
టిఘీ (మరాఠీ మూవీ)-మే 15
ప్రస్తుతం ప్రేక్షకులు థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ కథలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్‌లలో తెలుగు ఆడియన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నది తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2, ధురంధర్ 2, కాళిదాస్ 2, కర్తవ్య వంటి యాక్షన్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
అలాగే, నెట్‌ఫ్లిక్స్ ఈ వారం విభిన్న భాషల్లో ఎక్కువ కంటెంట్ అందిస్తుండటం విశేషం. ముఖ్యంగా జపనీస్ వెబ్ సిరీస్ సోల్‌మేట్, డాక్యుమెంటరీ చిత్రాలు ‘మార్టిన్, లైఫ్ ఈజ్ షార్ట్’, ‘ది క్రాష్’ వంటి కంటెంట్ ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వనున్నాయి.
