కొత్త పార్లమెంట్ భవనం పేరు ఇదే..

కొత్త పార్లమెంట్ భవనం పేరు ఇదే..

కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అంతా రెడీ అయింది. మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్త పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలవుతాయి. 

ALSO READ: సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు

మరోవైపు కొత్త పార్లమెంట్ భవనానికి కేంద్రం నామకరణం చేసింది.  పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టింది.  పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్‌ అని ప్రకటించింది.