శ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం

శ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీలో హైడ్రాలిక్ షావల్ ను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త యంత్రాలను తీసుకువచ్చి వాటి ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ షావల్​కు రోజుకు 8500 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టిని తీయగలిగే సామర్థ్యం ఉందని, యంత్రాన్ని సమర్థంగా ఉపయోగించి శ్రీరాంపూర్ ఏరియా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. 

ఉద్యోగులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్ రెడ్డి, ఏరియా ఇన్​చార్జి ఇంజనీర్ సాంబశివరావు, ఓసీపీ పీఓ చిప్ప వెంకటేశ్వర్లు, గని మేనేజర్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజనీర్ నాగ రాజు, గని రక్షణాధికారి శ్రీధర్, ఎస్ఈ విజయేందర్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు.