2021 ఏప్రిల్​ కల్లా కొత్త సిలబస్‌‌

2021 ఏప్రిల్​ కల్లా కొత్త సిలబస్‌‌

న్యూఢిల్లీస్కూల్​ ఎడ్యుకేషన్​కు సంబంధించి అతి పెద్ద సంస్కరణల ప్రక్రియ మొదలైంది. నేషనల్​ కరిక్యూలమ్ ఫ్రేం వర్క్(ఎన్ సీఎఫ్) రివ్యూకు సంబంధించిన ప్రపోజల్​ను నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్ ఎడ్యుకేషనల్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్(ఎన్ సీఈఆర్ టీ) ప్రారంభించింది. ఎన్​సీఎఫ్​ రిఫార్మ్స్​కు సంబంధించిన ప్రతిపాదనలను సెంట్రల్ హ్యూమన్​ రిసోర్స్​ డెవలప్​మెంట్​ మినిస్ట్రీకి సమర్పించింది. ఈ నెల మొదట్లో ఇచ్చిన ఈ రిపోర్ట్​ ప్రకారం.. 2021 ఏప్రిల్​ నాటికి కొత్త సిలబస్‌‌ రెడీ అవుతుంది. అప్పుడే కొత్త టెక్స్ట్​బుక్స్​ తయారీ కూడా మొదలవుతుంది. 2023 నాటికి కొత్త టెక్స్ట్​బుక్స్​ అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త సిలబస్‌‌లో ప్రతి సబ్జెక్ట్​లోనూ కంటెంట్​ను తగ్గించి కోర్​ మ్యాటర్స్​పైనే ఎక్కువగా ఫోకస్​ చేస్తారు. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ 2020లో భాగంగానే స్కూల్​ సిలబస్‌‌లో రిఫార్మ్స్​ ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివరి వారంలో ఈ పాలసీ కేంద్ర కేబినెట్​ ముందుకు రానుంది. 15 ఏండ్ల తర్వాత ఎన్​సీఎఫ్​ ను రివ్యూ చేస్తున్నారు. స్కూళ్లలో చెప్పే కంటెంట్ తో పాటు టీచింగ్​ మెథడ్స్​పైనా ఎన్​సీఎఫ్​లో భాగంగా రివ్యూ చేసి అవసరమైన సూచనలు చేస్తారు. ఎన్ సీఈఆర్​టీ గత నవంబర్​లోనే ఇంటర్నల్​గా వర్క్​ను మొదలుపెట్టింది. స్టీరింగ్​ కమిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రపోజల్స్​  సమర్పించింది. నేషనల్​ అస్సెస్​మెంట్​ సెంటర్​ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్స్​ సందర్భంగా దేశమంతటా ఒకే రకమైన అస్సెస్​మెంట్, ఎవాల్యూయేషన్​ ఉండేలా నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీలో ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగానే కొత్త నేషనల్​ కరిక్యూలమ్  ఫ్రేంవర్క్​ ఉండే అవకాశాలు ఉన్నాయి.

మామూలు పరిస్థితి వచ్చాకే స్కూల్స్​ తెరుస్తాం

ఇప్పటికిప్పుడు బడుల్ని తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే స్కూళ్లను తెరుస్తామని కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్​ రమేశ్​ పొఖ్రియాల్​ క్లారిటీ ఇచ్చారు. గురువారం జరిగిన లైవ్​ వెబినార్​లో ఆయన టీచర్లతో మాట్లాడుతూ.. యూనివర్సిటీల రీఓపెన్​ అంశంపై ప్రభుత్వం, ఎన్​సీఈఆర్​టీ, యూజీసీలు పలు ప్లాన్లను రెడీ చేస్తున్నాయని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్లలో సీటుకి సీటుకి మధ్య ఎడం, టైమింగ్స్​లో మార్పు, క్లాసుల్ని డివిజన్​ అమలులాంటి  అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్​ లెర్నింగ్​ ప్రాసెస్ ను  అనుసరించాలని మంత్రి టీచర్లను కోరారు.

ఆ స్టూడెంట్స్​ కు మరో చాన్స్​: సీబీఎస్ఈ

తొమ్మిది, లెవెన్త్​​  క్లాస్‌‌ల్లో ఫెయిలైన విద్యార్థులకు సెకండ్​చాన్స్​ఇవ్వాలని సెంట్రల్​బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్‌‌ఈ) నిర్ణయించింది. కరోనా క్రైసిస్​కారణంగా మరోసారి స్కూల్​బేస్డ్​ టెస్ట్‌‌లు పెడతామని చెప్పింది. 9, 11 క్లాసుల్లో ఫెయిలైన స్టూడెంట్స్​ ఆన్‌‌లైన్​లేదా ఆఫ్‌‌లైన్​ఎగ్జామ్స్​కండక్ట్​చేస్తామని సీబీఎస్‌‌ఈ కంట్రోలర్​సన్యం భరద్వాజ్​చెప్పారు.

సొంతూరు పోతుంటే ప్రాణాలు పోయాయి