Thug Life: థగ్ లైఫ్లోకి శింబు స్టైలీష్ ఎంట్రీ.. వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్!

Thug Life: థగ్ లైఫ్లోకి శింబు స్టైలీష్ ఎంట్రీ.. వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్!

లోకనాయకుడు కమల్‌హాసన్‌ (Kamalhaasan) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ థగ్‌ లైఫ్‌(Thug life). తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాలో దుల్కర్ సల్మాన్‌, జయం రవి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, త్రిష, ఐశ్వర్యలక్ష్మి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ స్టార్స్ లిస్టులోకి మరో స్టార్ చేరారు. ఆ స్టార్ మరెవరో కాదు శింబు. తాజాగా థగ్ లైఫ్‌ సినిమాలో ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.

కొత్త థగ్‌ (క్రిమినల్)కు స్వాగతం పలికే సమయం.. అంటూ వచ్చిన ఈ వీడియో మోస్ట్ స్టైలీష్ గా నెక్స్ట్ లెవల్లో ఉంది. శింబు కూడా తన మార్క్‌ ప్రెజెన్స్ తో ఇన్నోవా కార్ లో స్టైలిష్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ వీడియోకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఒక్క వీడియో థగ్ లైఫ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తుండగా.. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌,  మద్రాస్ టాకీస్‌, రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.