పియాజియో అపే ఎలక్ట్రిక్ ఆటోల్లో కొత్త వెర్షన్లు

పియాజియో అపే ఎలక్ట్రిక్ ఆటోల్లో కొత్త వెర్షన్లు

పియాజియో అపే ఎలక్ట్రిక్ ఆటోల్లో 2025 వెర్షన్లను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.3.30 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతున్నాయి. ఈ లైనప్‌‌‌‌లో అపే ఈ-– సిటీ అల్ట్రా, అపే ఈ -సిటీ ఎఫ్‌‌‌‌ఎక్స్ మ్యాక్స్ ఉన్నాయి. ఈ– సిటీ అల్ట్రాలో 10.2 కిలోవాట్‌‌‌‌ అవర్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్‌‌‌‌పై ఇది 236 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ–సిటీ ఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌లో 8.0 కిలోవాట్‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌  బ్యాటరీ ఉంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌‌‌‌పై 174 కి.మీ. రేంజ్ ఇస్తుంది.  రెండూ 5 సంవత్సరాలు లేదా 2.25 లక్షల కిమీ వారంటీతో వస్తున్నాయి.  ఎఫ్‌‌‌‌ఎక్స్ మ్యాక్స్ ధర రూ.3.30 లక్షలు , అల్ట్రా ధర 3.88 లక్షలు.