
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కలర్ఫుల్లైట్స్, క్రాకర్స్ సౌండ్స్ నడుమ వేడుకలు జోష్ గా సాగాయి. డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ యూత్ ఫుల్ ఎంజాయ్చేశారు. బాలీవుడ్ సింగర్స్ సాంగ్స్‌తో హోరెత్తించారు. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ షోలతో అదరగొట్టారు.
ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్ లో మునిగిపోయారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా సిటీలోని పలు ప్రాంతాలు నయాసాల్ వేడుకలు జోరుగా కొనసాగాయి. క్లబ్‌లు, పబ్‌లు, టూరిజం స్పాట్లతోపాటు వంద ప్రదేశాల్లో సెలబ్రేషన్స్ఈవెంట్లు జరిగాయి. ఎన్కన్వెన్షన్, బేగంపేటలోని కంట్రీక్లబ్, చిరాన్ ఫోర్టు క్లబ్, తాజ్ ఫలక్నామా ప్యాలెస్, మాదాపూర్ బుట్టా కన్వెన్షన్, ది పార్క్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మ్యూజిక్నైట్స్, లైవ్ ఆర్కెస్ర్టాలకు కేరింతలు కొట్టడంతో సందడి నెలకొంది.
ఈవెంట్లకు వెళ్లలేని వారు ఇండ్లలోనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గెట్ టు గెదర్లు ఏర్పాటు చేసుకున్నారు. అపార్టుమెంట్లు, కాలనీల్లో స్పెషల్ ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేసి చిన్నా, పెద్ద అంద రూ డీజే పాటలకు స్టెప్పులు వేశారు. సిటీ శివారుల్లో రిసార్టులు, ఫాంహౌస్‌ల్లో సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి.