
పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ అత్యంత ఖరీదైన 172 నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి. 3వ స్థానం ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్, నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్ ఏంజెలెస్, జ్యూరిట్(ఆరు), జెనీవా(ఎనిమిది), శాన్ఫ్రాన్సిస్కో(ఎనిమిది), ప్యారిస్(తొమ్మిది) స్థానంలో ఉన్నాయి. కోపెన్‌హాగెన్, సిడ్నీ ఉమ్మడిగా పదో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో చివరి స్థానాల్లో డమాస్కస్, ట్రిపోలి ఉన్నాయి. భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగళూరు(161), చెన్నై (164), అహ్మదాబాద్(165) స్థానాల్లో ఉన్నాయి.