కరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులకు న్యూజిలాండ్ నో ఎంట్రీ

V6 Velugu Posted on Apr 08, 2021

వెల్లింగ్టన్: మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు భారత ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు న్యూజిలాండ్ ప్రవేశాన్ని నిలిపివేసింది. ఆ దేశంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 17 భారత్ నుంచి వచ్చిన వారే కావడంతో న్యూజిలాండ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తమ దేశంలోకి రాకుండా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్దర్న్ తెలిపారు. 

Tagged India, newzealand, No Entry, Travellers

Latest Videos

Subscribe Now

More News