మౌంట్ మాగనుయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బోణీ చేసింది. లక్ష్య ఛేదనలో డారిల్ మిచెల్ (78 నాటౌట్), మైకేల్ బ్రాస్‌వెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (101 బాల్స్‌లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 135) సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం దక్కలేదు. జెమీ స్మిత్ (0), బెన్ డకెట్ (2), జో రూట్ (2), జాకబ్ బెథెల్ (2), బట్లర్ (4), సామ్ కరన్ (6) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బ్రూక్, జెమీ ఓవర్టన్ (46) ఏడో వికెట్‌కు 87 రన్స్ జోడించారు.
ఛేజింగ్‌లో కివీస్ 36.4 ఓవర్లలో 224/6 స్కోరు చేసి నెగ్గింది. విల్ యంగ్ (5), రచిన్ రవీంద్ర (17), కేన్ విలియమ్సన్ (0) ఫెయిలయ్యారు. టామ్ లాథమ్ (24), మిచెల్ శాంట్నర్ (27) పర్వలేదనిపించారు. బ్రైడన్ కార్సీ 3 వికెట్లు తీశాడు. బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం హామిల్టన్‌లో జరుగుతుంది.
