
చందానగర్, వెలుగు : అప్పుడే పుట్టిన ఓ మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చందానగర్పాపిరెడ్డికాలనీ రాజీవ్‌గృహకల్ప కాలనీ బ్లాక్ నెం.27 వద్ద ఉన్న ముళ్లపొదల్లో మంగళవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో స్థానికులకు పసిపాప ఏడుపు వినిపించింది. అక్కడకు వెళ్లి చూడగా మగ శిశువు కనిపించాడు. వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసిపాపను నిలోఫర్హాస్పిటల్కు తరలించారు. అనంతరం యూసఫ్‌గూడలోని శిశు విహార్‌కు అప్పగించారు. పసికందు జన్మించి ఒక రోజు అయి ఉండొచ్చని తెలుస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రవీందర్ తెలిపారు.