కొత్తగా పెళ్లైన మహిళలు హోలీ ఎక్కడ ఆడాలో తెలుసా..

కొత్తగా పెళ్లైన మహిళలు హోలీ ఎక్కడ ఆడాలో తెలుసా..

 హోలీ రంగురంగుల పండుగ. ఈ పండుగకు  హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం అత్తవారింట హోలీ ఆడకూడదని పురాణాలు చెబుతున్నాయి.  వారు పుట్టింటికి వెళ్లి హోలీ ఆడాలంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు ..ఇప్పుడు ఆవివరాలను తెలుసుకుందాం. . .

ఫాల్గుణమాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ప్రభుత్వ సెలవుదినంగా కూడా పాటిస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 25వ తేదీన రానుంది. ఈనేపథ్యంలో హోలీ పండుగను కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం అత్తవారింట జరుపుకోకూడదనే ఆనవాయితీ ఉందని పండితులు చెబుతున్నారు. . హోలీ సందర్భంగా నిర్వహించే హోలికా దహనాన్ని కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ అత్తవారింట చూడకూడదట. ఒకవేళ పొరపాటున అత్తాకోడళ్లు కలిసి హోలీకా దహనం చూస్తే అత్తాకోడళ్లకు మధ్య గొడవలు జరుగుతాయి.  అంతేకాదు హోలికా దహనాన్ని గర్భిణులు కూడా చూడకూడదని పండితులు చెబుతారు. అదే కొత్తగా పెళ్లైన మహిళ పుట్టింట హోలీ పండుగ జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం ...

హోలీ పండుగ గురించి రకరకాల కథనాలు చెబుతారు. శివుడుని పార్వతిదేవి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ, శివుడు తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు శివయ్యలో ప్రేమను పుట్టించేందుకు కామదేవుడైన మన్మథుడు మన్మథ బాణం వదులుతాడు దీంతో కోపోద్రిక్తుడైనా శివుడు మూడో కన్ను తెరచి కామదేవుడిని భస్మం చేస్తాడు. బూడిదగా మారిన తన భర్తను చూసి రతిదేవి వైధవ్యాన్ని మోయాల్సి వస్తుంది. ఆ తర్వాత శివుడికి పార్వతి మొత్తం విషయాన్ని చెప్పింది కానీ, ఇప్పటి వరకు ఆ అపవాదం కామదేవుడు మోస్తూనే ఉన్నాడు.

ఆ తరువాత విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు.. హోలీ రోజున అంటే పాల్గుణమాసం పౌర్ణమి రోజున కొత్తగా పెళ్లైన మహిళ అత్తగారింట్లో రంగులు చల్లకూడదనే శాపం ఉందని రుషిపుంగవులు చెబుతున్నారు.  ఒకవేళ అలా ఆడితే.. అత్తోకోడళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని పండితులు చెబుతున్నారు.  అసలు అత్తగారింట్లో హోలికా దహనాన్ని చూడకపోవడమే మంచిదని అంటున్నారు పండితులు. సో న్యూ కపుల్స్​ హోలీ ఆడేటప్పుడు మరి జాగ్రత్త. . .  .