లోకేశ్వరం, వెలుగు: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సేవాలాల్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే టీచర్ బోధిస్తున్నారు. స్కూల్ లో ముగ్గురు టీచర్లు ఉండగా.. ఒకరు ఉన్నత చదువులకు, మరొకరు మెటర్నిటీ లీవ్ పై వెళ్లారు. టీచర్ల సర్దుబాటులో భాగంగా స్కూల్ కు ఒక టీచర్ ను కేటాయించగా హెడ్మాస్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో జాయిన్ కాలేదు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 62 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, స్కూల్ బయట అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి ప్రధానోపాధ్యాయుడు ఎ.లక్ష్మణ్ పాఠాలు చెబుతున్నారు. గ్రామస్తులు స్కూల్ కు సరిపడా టీచర్లను నియమించాలని ఎంఈఓ చంద్రకాంత్ ను కోరారు. సోమవారం స్కూల్ కు వేరే టీచర్లను పంపిస్తానని హామీ ఇచ్చారు.
