శ్రద్ధా వాకర్ హత్య కేసు : రెండేళ్ల క్రితమే గొడవ.. ఆఫ్తాబ్పై పోలీసులకు ఫిర్యాదు

శ్రద్ధా వాకర్ హత్య కేసు :  రెండేళ్ల క్రితమే గొడవ.. ఆఫ్తాబ్పై  పోలీసులకు ఫిర్యాదు

దేశం ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. శ్రద్దా వాకర్, నిందితుడు ఆఫ్తాబ్ మధ్య రెండేళ్ల క్రితమే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆఫ్తాబ్ శ్రద్దాను కొట్టడంతో ఆమె మహారాష్ట్రలోని వసాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పుడే తనను చంపి ముక్కులు చేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రద్దా ఆ ఫిర్యాదులో కీలక విషయాలు ప్రస్తావించింది. ఆఫ్తాబ్ ఫ్యామిలీ గురించి కూడా అప్పట్లో తన ఫిర్యాదులో తెలిపింది. ఆఫ్తాబ్ ప్రవర్తన గురించి అతని పేరెంట్స్ కు తెలుసని..తాము కలిసే ఉంటున్నట్లు కూడా వారికి తెలుసని చెప్పింది.

అయితే తమ పెళ్లికి ఆఫ్తాబ్ పేరెంట్స్ ఒప్పుకున్నారని శ్రద్దా చెప్పింది. ఆఫ్తాబ్ ప్రవర్తన చూసి అతనితో కలిసి ఉండటం ఇష్టం లేదని ఫిర్యాదులో ప్రస్తావించింది. అయిన శ్రద్దా వాకర్, ఆఫ్తాబ్ తో ఎందుకు కలిసి ఉందో అనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. 2020 సంవత్సరంలో మహారాష్ట్రలో శ్రద్దా ఇచ్చిన ఫిర్యాదు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కస్టడీ ముగియడంతో నిన్న (నవ ఇవాళ ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను కోర్టులో హాజరుపరచగా... తాను కోపంలో, ఆవేశంలో శ్రద్ధాను హత్య చేసినట్టు అంగీకరించాడు. అయితే ఈ సంఘటన జరిగి చాలా రోజులవుతున్నందున తనకేమీ గుర్తు లేదని చెప్పాడు. అనంతరం అఫ్తాబ్ కు పోలీసు కస్టడీని మరో 4 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ముందుగా అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. అది నవంబరు 22తో ముగియడంతో అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్‌ కోర్టు ముందు హాజరుపర్చారు.

విచారణ సందర్భంగా ఘర్షణ వాతావరణంతో క్షణికావేశంలో ఆ ఘటన జరిగిందని అఫ్తాబ్ చెప్పాడు. అనంతరం కేసు దర్యాప్తు కోసం తాను పోలీసులకు సహకరిస్తానన్న అఫ్తాబ్... శ్రద్ధా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పానన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు వెల్లడిస్తాని స్పష్టం చేశాడు. తాను చెప్పేవన్నీ నిజాలేనని, పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదని అఫ్తాబ్ చెప్పాడు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినందున చాలా విషయాలు తనకు గుర్తు రావట్లేదని అఫ్తాబ్‌ కోర్టుకు తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.