ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha) మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ న్యూసెన్స్(NEWSENSE ). యాక్టర్ నవదీప్(Navadeep), బిందుమాధవి(Bindu madhavi) ప్రాధాన పాత్రల్లో రానున్న ఈ సిరీస్ ని శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో మీడియాకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?డబ్బు ఉన్న వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు. నిజాలను దాచేసి,, వాళ్ళకి అనుగూనంగా వాటిని ఎలా మార్చుకుంటున్నారు అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నారు మేకర్స్. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజుల్లో న్యూస్ అనేది న్యూసెన్స్ లా ఎలా మారిపోతుంది అనేది సెటైరికల్ గా చూపించనున్నారు.
ఈ సిరీస్ నుండి ఇప్పటికే రిలీజైన టీజర్స్ అండ్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ మే 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి బొమ్మరిల్లు భాస్కర్, నవదీప్,బిందు మాధవి, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, వివేక్ కూచిబట్ల, SKN తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సీరీస్ ఖచ్చితంగా ప్రేక్షకుల ఆధారణ పొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్ట్ వన్ జస్ట్ కథలో చిన్న భాగ్యమేనని పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని వారు తెలిపారు.