
న్యూఢిల్లీ: కాంక్రీట్పరిశ్రమ కోసం వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా 2025 పదకొండో ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్టు ఇన్ఫార్మా మార్కెట్స్ ప్రకటించింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ (బీఈసీ)లో వచ్చే నెల 8 నుంచి 10 వరకు ఇది జరగనుంది. ఈ కార్యక్రమంలో 250కి పైగా ఎగ్జిబిటర్లు, 350కి పైగా బ్రాండ్లు, నిర్మాణ రంగానికి చెందిన 15,000 మంది నిపుణులు పాల్గొంటారు.
జిందాల్ పాంథర్ సిమెంట్ సీఈఓ రోహిత్ వోరా, కన్సల్టెంట్ అంచూరి వంటి పారిశ్రామికవేత్తలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాన్ని తీర్చిదిద్దుతున్న మార్కెట్ అవకాశాలు, స్థిరమైన పద్ధతులు, వినూత్న టెక్నాలజీల గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
ఈ ఎగ్జిబిషన్లో కాంక్రీట్ పరిశ్రమకు సంబంధించిన కొత్త టెక్నాలజీలు, ఉత్పత్తులు, నిర్మాణ సామాగ్రి లాంటివి ప్రదర్శిస్తారు. నిపుణులతో చర్చలు, సదస్సులు కూడా ఉంటాయి.