
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై 22 రోజుల తరువాత గత ఏడాది నవంబర్ 25న చనిపోయింది. ఈ ఘటనలో మరో- 60 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు.
దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ను న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆశ్రయించారు.- దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది.