
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 434 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలకు మించరాదు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత జోన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి. అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 5 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.cfw.ap.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.