మహా అద్భుతం : నెల రోజుల్లో మూడు బుల్లెట్ రైలు బ్రిడ్జీలు కట్టారు

మహా అద్భుతం : నెల రోజుల్లో మూడు బుల్లెట్ రైలు బ్రిడ్జీలు కట్టారు

ఇండియా అభివృద్ధి చెందేసింది.. అద్భుతాలు కదా.. మహా అద్బుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో.. ఇన్ ఫ్రా రంగంలో చరిత్ర సృష్టిస్తోంది ఇండియా. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం.. నెల అంటే నెల రోజుల్లో.. మూడు నదులపై.. మూడు బిడ్జిలను కట్టేశారు ఇంజినీర్లు. ఇండియా నిర్మాణ రంగంలో ఇది మహా అద్భుతం అనే చెప్పాలి. నెల రోజుల్ల్ మూడు బ్రిడ్జీలు కట్టేయటం అనేది ఇంత వరకు ఇండియా చరిత్రలో జరగలేదు అంటున్నారు ఇంజినీర్లు, మేధావులు. పూర్తి వివరాల్లోకి వెళితే...

భారత్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు( పనులు వేగంగా జరుగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ (MAHSR) పనులను పరిశీలించిన అధికారులు.. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గుజరాత్‌లో ఒక నెలలోనే మూడు నదీ వంతెనలను పూర్తి చేశామని తెలిపారు. హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మిస్తోన్న నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ (NHSRCL)అధికారులు గత ఆరు నెలల్లో 24 వంతెనల్లో నాలుగు నిర్మించినట్లు చెప్పారు. గుజరాత్ లోని హైస్పీడ్ మార్గంలో బిలిమోరా, సూరత్ స్టేషన్ మధ్య ఉన్న నవ్‌సారి జిల్లాలో ఈ నాలుగు వంతెనలలో మూడు నిర్మించబడ్డాయన్నారు. మొదటి వంతెనను పూర్ణా నదిపై, రెండవది మింధోలా నదిపై, మూడవ వంతెనను అంబికా నదిపై నిర్మించినట్లు చెప్పారు. గుజరాత్‌లోని పొడవైన నది వంతెన 1.2 కి.మీ,ఇది నర్మదా నదిపై దీన్నినిర్మించారు. అదే సమయంలో ఈ కారిడార్ పొడవైన నది వంతెన మహారాష్ట్రలో 2.28 కి.మీ. ఇది వైతర్ణ నదిపై నిర్మించారు. గత నెలలో మూడు నదీ వంతెనలు పూర్తి కావడంతో MAHSR కారిడార్ ఎంతో పురోగతి సాధించింది.

హైస్పీడ్ కారిడార్‌లో మొత్తం 24 నదీ వంతెనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో 20 గుజరాత్‌లో, మిగిలిన 4 మహారాష్ట్రలో ఉన్నాయన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొదటి దశ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న NHSRCL.. నదులపై వంతెనల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళిక అవసరమని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మింధోలా, పూర్ణా నదిపై వంతెనల నిర్మాణ సమయంలో అరేబియా సముద్రపు అలలను నిశితంగా పరిశీలించామని ఇప్పటికే అధికారులు తెలిపారు. అంబికా నదిపై వంతెన నిర్మాణానికి ఇంజనీర్లు 26 మీటర్ల ఎత్తు నుంచి పనిచేశారని చెప్పారు. పూర్ణా నదిపై వంతెన పొడవు 360 మీటర్లు, దాని నిర్మాణ సమయంలో, అరేబియా సముద్రంలో అధిక, అల్ప ఆటుపోట్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉండిందని NHSRCL తెలిపింది.

https://twitter.com/nhsrcl/status/1675407391947407362