"నైస్ ట్రై నాసా".. మస్క్ సెటైరికల్ ట్వీట్

"నైస్ ట్రై నాసా".. మస్క్ సెటైరికల్ ట్వీట్

ఎంతటి సీరియస్ విషయాన్నైనా చిన్న ట్వీట్ తో కామెడీగా మార్చే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. అదే ఎంతటి చిన్న విషయాన్నైనా పెద్దది చేసే విషయంలోనూ తనకు తానే సాటి అని నిరూపిస్తుంటుంటాడు. అలాంటిదే తాజాగా జరిగింది. ఆయన చేసింది చిన్న ట్వీట్ అయినా.. దాని వాల్యూ చాలానే ఉంటుంది. దానికి ఆయన చేసిన పోస్టే కారణం. అదీ ఇటీవల మానవాళి ఎన్నడూ చూడని అతి సుదూరమైన దృశ్యంపై. మంచి ప్రయత్నం నాసా అని పొగుడుతూనే.. దానికి ఓ సెటైరికల్ ఫొటోను జత చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. నాసా షేర్ చేసిన పిక్ ను .. వంటగదిలో వేసే గ్రానైట్ స్లాబ్ తో కంపేర్ చేస్తూ.. నైస్ ట్రై నాసా అనే క్యాప్షన్ ను మస్క్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఓ అపురూప చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలైంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ వైట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ ఫొటోలో విశ్వంలో ఉండే వేలాది గెలాక్సీలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలం, నారింజ, తెలుపు రంగుల్లో దర్శనమిస్తున్న ఈ పిక్ ను ఇటీవల నాసా షేర్ చేసింది. విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదేనని నానా పేర్కొంది.