IPL 2024: కృనాల్ పాండ్యపై వేటు.. లక్నో కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు వీరే

IPL 2024: కృనాల్ పాండ్యపై వేటు.. లక్నో కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు వీరే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ  గురువారం (ఫిబ్రవరి 29) తమ కొత్త వైస్ కెప్టెన్‌, వైస్ కెప్టెన్లను ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్ బాధ్యతలను నికోలస్ పూరన్ కు అప్పగించారు. రాహుల్ గాయం కారణంగా 2023 సీజన్ మధ్యలో నుండి తప్పుకున్న తర్వాత.. కృనాల్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే తాజాగా ఈ బాధ్యతలను పూరన్ కు అప్పగించారు. 

లక్నో సూపర్ జయింట్స్ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. కేఎల్ రాహుల్ జెర్సీ నంబర్ 29ని పూరన్‌కు అందజేసినట్లు సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటో క్యాప్షన్ చేస్తూ ఫోటో జోడించింది. పూరన్ తన స్ట్రోక్ మేకింగ్ కాకుండా గొప్ప నాయకత్వ అనుభవాన్ని టీ20 ఫార్మాట్‌లో సొంతం చేసుకున్నాడు. అతను ఇటీవలే ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20) 2024లో MI ఎమిరేట్స్‌కు నాయకత్వం వహించాడు. 

అతని నాయకత్వ లక్షణాలు లక్నో సూపర్ జయింట్స్ జట్టుకు ఉపయోగపడతాయని ఆ జట్టు ఫ్రాంచైజీ వివరించారు. లక్నో సూపర్ 2022 లో ఐపీఎల్ లో కొత్త జట్టుగా చేరింది. 2022, 2023 లో వరుసగా రెండు సీజన్ లలో ప్లే ఆఫ్ కు చేరిన జట్టుగా నిలిచింది. మార్చి 24న LSG రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ తో ఈ లీగ్ ను ప్రారంభించనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.