LSG vs DC: ఇలాంటివి కుల్దీప్‌కే సాధ్యం: స్టన్నింగ్ డెలివరీతో మైండ్ బ్లాంక్ చేశాడుగా

LSG vs DC: ఇలాంటివి కుల్దీప్‌కే సాధ్యం: స్టన్నింగ్ డెలివరీతో మైండ్ బ్లాంక్ చేశాడుగా

టీమిండియా లెఫ్టర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో వేసుకోవడం సహజమే. అయితే కొన్నిసార్లు ఊహకందని రీతిలో బంతులు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. ఇలాంటి బంతులకు ఎంతటి బ్యాటర్ అయినా వికెట్ కోల్పోవాల్సిందే. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో బాబర్ అజామ్, బట్లర్ ను స్టన్నింగ్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. తాజాగా ఐపీఎల్ లో ఒక సూపర్ డెలివరీతో వావ్ అనిపించాడు. 

ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 12) ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ  మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్ లోనే మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతికి ఫామ్ లో ఉన్న స్టోయినీస్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికే పూరన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఆ బాల్‌.. పూర‌న్ అంచనా వేయలేకపోయాడు. బ్యాట్ మధ్యలో నుంచి వెళుతూ వికెట్ల‌ను గిరాటేసింది. ఈ చైనామన్ స్పిన్నర్ వేసిన వేగానికి ఆఫ్ స్టంప్ విరిగిపోయింది. దీంతో అంపైర్లు ఆ వికెట్‌ను మార్చాల్సి వ‌చ్చింది.

ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. తొడ కండరాల గాయంతో చివరి రెండు మ్యాచ్ లకు కుల్దీప్ దూరమైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో డీసీ 6 వికెట్ల తేడాతో లక్నోపై నెగ్గింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో ఢిల్లీ 18.1 ఓవర్లలో 170/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. . అరంగేట్రం ఆటగాడు జేక్ ఫ్రేజర్‌‌‌‌ మెక్‌‌‌‌గర్క్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 55) ఫిఫ్టీకి తోడు కెప్టెన్ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 41), పృథ్వీ షా (22 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 32) రాణించారు.