ఎన్‌‌ఐడీలో బీ-డిజైన్‌‌ కోర్సు

ఎన్‌‌ఐడీలో బీ-డిజైన్‌‌ కోర్సు

నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌‌ఐడీ) 2023-–2024 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌‌ఐడీ క్యాంపస్‌‌లలో బీడిజైన్‌‌ కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

స్పెషలైజేషన్: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ అండ్‌‌ ఇంటీరియర్ డిజైన్, టెక్స్‌‌టైల్ డిజైన్ తదితరాలు.

అర్హతలు: అభ్యర్థులు 2003 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2023 మే/ జూన్‌‌ నాటికి ఇంటర్‌‌/ పన్నెండో తరగతి(సైన్స్‌‌, ఆర్ట్స్‌‌, కామర్స్‌‌, హ్యుమానిటీస్‌‌ గ్రూపు) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.  ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో డిసెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్​ డిసెంబర్​ 24న నిర్వహించనున్నారు. వివరాలకు  www.admissions.nid.edu వెబ్​సైట్​లో సంప్రదించాలి.