
ముంబై: నిఫ్టీ 50 ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజ్‌ను 75 నుంచి 65కి తగ్గించాలని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిర్ణయించింది. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ 35 నుంచి- 30 కి, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 65 నుంచి 60కి, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ 140 నుంచి 120కి తగ్గించనుంది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి ఈ కొత్త లాట్ సైజ్‌లు అమల్లోకి వస్తాయి.
నిఫ్టీ నెక్స్ట్ 50 లాట్ సైజ్ మాత్రం 25 దగ్గర కొనసాగుతుంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం, కాంట్రాక్ట్ విలువలను బ్యాలెన్స్ చేయడానికి తాజాగా లాట్ సైజ్‌ను సవరించారు. 2026 లోని కాంట్రాక్టులకు మాత్రమే కొత్త లాట్ సైజ్ వర్తిస్తుంది. ఈ మార్పుతో ట్రేడర్లు తమ పొజిషన్ సైజ్, మార్జిన్ అవసరాలను మార్చుకోవాలి.
రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ క్యాపిటల్‌తో ట్రేడింగ్ చేయడం ఇక సులభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సూచీల సగటు ముగింపు ధర ఆధారంగా ఈ లాట్ సైజ్‌లు లెక్కించారు.