
ఇగ్బో ఓరా.. సౌత్ ఈస్ట్ నైజీరియాలోని ఓ గ్రామం. ఈ ఊరికి మరో పేరు ఉంది. ‘ప్రపంచ కవలల రాజధాని’ అని పిలుస్తుంటారు. ఎందుకంటారా?ఒకసారి ఆ ఊరిలోకి వెళ్తే చాలు.. మొత్తం విషయం అర్థమైపోతుంది. విలేజీలో ఎక్కడ చూసినా పిల్లల నుంచి పెద్దల వరకు ట్విన్స్ కనిపిస్తుంటారు. ప్రపంచంలోమరెక్కడా లేనంతగా ట్విన్స్ బర్త్ ఇక్కడ నమోదుతోంది. అందుకే ఊరి పొలి మేరల్లోనే ‘ట్విన్స్ క్యాపిటల్ కుస్వాగతం’ అని ఓ బ్యానర్ కూడా కనిపిస్తుంది.
1970ల నాటి నుంచే..
సౌత్ ఈస్ట్ నైజీరియాలో యోరుబా జాతి ప్రజలకు ఎక్కువగా ఉంటారు. యోరుబా ప్రజల్లో కవలలపుట్టుక సర్వ సాధారణం. 1970ల్లో ఓ బ్రిటిష్ గైనకాలజిస్ట్ చేసిన స్టడీ ప్రకారం ప్రతి 1000 జననాల్లో, కనీసం 50 కవలలవే (100 మంది). ట్విన్స్ బర్త్ రేట్విషయంలో ఇది ప్రపంచంలోనే ఎక్కువ. ప్రస్తుతంఇగ్బో ఓరా గ్రామంలోని సెకెం డరీ స్కూల్ లో 100మంది పిల్లలు ఉంటే అందులో సుమారు 20 మందికవలలే.
ఓక్రా ఆకుల వల్లే‘‘
మేం ఓక్రా ఆకులను తింటాం . అందుకే ఇక్కడట్విన్స్ ఎక్కువగా పుడతారు’’ అని 15 ఏళ్ల కేహిండేఓయ్ డెపో చెప్పాడు. ఇతడు కవలల్లో ఒకడు.ఓక్రా ఆకులతో ఇక్కడ కూరలు చేసుకుంటారు. చాలా ఇష్టంగా తింటారు. మరోవైపు ‘అమాల’ అనే డిష్కూడా ఇక్కడ పాపులర్. యమ్, కసావా (ఇవి రెండూ పెండలం దుంపల మాదిరి ఉంటాయి)లతోఅమాల చేస్తారు. యమ్ దుంపలు గోనడోట్రో పిన్స్ ప్రొడక్షన్ ను పెంచుతాయనే థియరీ ఉంది(అండాలఉత్పత్తిలో ఓ కెమికల్ ఏజెంట్ మాదిరి గోనడోట్రో పిన్స్ పని చేస్తాయి). దీంతో ట్విన్స్ ఎక్కువగా పుట్టడానికి కారణం ఓక్రా ఆకులే అని కొందరు, యమ్దుంపలని మరికొందరు ఇక్కడ వాదిస్తుంటారు.
వారసత్వం కావచ్చు
అయితే ఓక్రా ఆకుల వల్లనో, యమ్ దుంపల వల్లనో ట్విన్స్ఎక్కువగా పుడుతున్నారని సైంటిఫిక్ గా ఎవరూ రుజువు చేయలేరని గైనకాలజిస్ట్ ఎకుజుమి ఓ లారెన్వజు చెప్పారు.‘‘వారసత్వం కూడాట్విన్స్ ఎక్కువగా పుట్టడానికి కారణంకావచ్చు. ఏళ్లుగాఇంటర్ మ్యారేజీలు జరగడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిఉండొచ్చు” అని అభిప్రాయపడ్డారు. కానీ ఎకుజుమివాదనను స్థాని క మహిళలు కొట్టిపారేస్తున్నారు.8 సార్లు కవలలకు జన్మనిచ్చా‘‘ఓక్రా ఆకులను ఎలా తిం టామనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఓక్రా ఆకులతో చేసిన కూరను వెంటనేతినేస్తాం. నిల్వచేయం. ట్విన్స్ ఎక్కువగా పుట్టడానికి అవే కారణం. ఇందుకు నేనే సజీవ సాక్ష్యం. నేనుఓక్రా ఆకులను ఎక్కువగా తింటా. అందుకే 8 సార్లు కవలలకు జన్మనిచ్చా ” అని స్థానికంగా బ్రెడ్ అమ్ముకునే ఓయ్ నైక్ బామిమోర్ చెప్పారు.