వైద్య విద్యలో అయిజ స్టూడెంట్​ ప్రతిభ

వైద్య విద్యలో అయిజ స్టూడెంట్​ ప్రతిభ

అయిజ, వెలుగు: పట్టణానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి, శారద దంపతుల కూతురు నిహారిక వైద్య విద్యలో ప్రతిభ చాటింది. నీట్  సూపర్  స్పెషాలిటీ ఫలితాల్లో ఆల్  ఇండియా 22వ ర్యాంకు సాధించింది. పీడియాట్రిక్  న్యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాలకు రెండు సీట్లు ఉండగా, అందులో ఒక సీటును నిహారిక దక్కించుకుంది.

హైదరాబాద్  రెయిన్ బో హాస్పిటల్ లో ట్రైనింగ్  పొందుతున్న ఆమెను ఇండియన్  రెడ్ క్రాస్  సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ తాహెర్, స్థానిక డాక్టర్లు వెంకటస్వామి, నవీన్ కుమార్  తదితరులు బుధవారం ఆమెను సన్మానించి అభినందించారు.