నిహారిక రాసిన ప్రేమలేఖ ఎవరికీ? వైరల్ అవుతున్న ఇన్స్టా పోస్ట్

నిహారిక రాసిన ప్రేమలేఖ ఎవరికీ? వైరల్ అవుతున్న ఇన్స్టా పోస్ట్

నిహారిక కొణిదెల(Niharika konidela) ప్రేమలేఖ రాశారు. చాలా ఎమోషనల్ గా సాగిన ఆ లవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ లెటర్ నిహారిక ఎవరికీ రాశారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నిహారిక జీవితంలో తనకిష్టమైన వారందరూ ఉన్నారు. ఆ వీడియో పోస్ట్ చేసి దానికి లవ్ లెటర్ టూ మై ఏంజిల్స్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడేమోలో నిహారిక అమ్మ, లావణ్య త్రిపాఠి, జ్యోతిరాజ్ సందీప్, వితికా షేరు.. ఇంకా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇక ఆ వీడియోలో.. నా జీవితంలోకి వచ్చినందుకు మీఅందరికీ నా కృతజ్ఞతలు. మీతో గడిపిన ఆ మధురమైన క్షణాలను నా  జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ నిహారిక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపించింది. అలా ఈ వీడియో ద్వారా తన లైఫ్ లో ఉన్న ప్రత్యేకమైన వ్యక్తులకు లవ్ లెటర్ రాశారు నిహారిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఇక నిహారిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె నిర్మాతగా కొత్త సినిమాను ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటివరకు ఈ బ్యానర్ పై షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లి నిర్మించిన నిహారిక.. ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిం ను నిర్మిస్తున్నారు. అంతా కొత్తవాళ్లతో వస్తున్న ఈ సినిమా వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.