పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’(PATANG). ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ప్రీతి పగడాల, స రి గ మ ప సింగర్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, విష్ణు ఓయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ బ్యానర్స్ పై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా పతంగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. మధ్యలో ఓ అమ్మాయి.. ఆమె కోసం ఆ ఇద్దరూ శత్రువులుగా మారి కొట్టుకోవడం ఇదే మెయిన్ స్టోరీలా కనిపిస్తోంది. అయితే, ఈ ముగ్గురి మధ్య నడిచే ప్రేమకు, పతంగుల పోటీ పెట్టడం సినిమాను ప్రత్యేకంగా నిలపనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. మధ్యలో ఓ అమ్మాయి.. ఈ కాన్సెప్ట్ కథలు తెలుగులో చాలా చూసున్నారు ప్రేక్షకులు. కానీ, వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పతంగ్ నేపథ్యం ఎలా వచ్చింది అనేది క్యూరియాసిటీ తీసుకొస్తుంది. ట్రైలర్ లో సాగిన సీన్స్, డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
ఈ సందర్భం గా నిర్మాతలు మాట్లాడుతూ.. కొత్తవాళ్లతో చేసిన సినిమా అయినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. కలర్ఫుల్ విజువల్స్ తో పాటు ఈ సినిమాకు కథే హీరో. సంగీత దర్శకుడు జోస్ జిమ్మి అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. పాటలు వింటూనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు పతంగుల పోటీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా అల రిస్తుందనే నమ్మకం మాకు ఉంది అని తెలిపారు.
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే వినూత్నకథాంశంతో రూపొందిన ‘పతంగ్’ ఈ డిసెంబర్లో థియేటర్లలో ఓ పండుగ వాతావర ణాన్ని తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నా యి. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
