విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక..

విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక..

తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్ స్టాగ్రమ్ లో ప్రకటించారు నాగబాబు కూతురు నిహారిక. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బందిపెట్టొద్దని ఇన్ స్టాలో కోరారు.  తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో  ప్రైవసీ కావాలని..దీనిని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు.

నిహారిక, చైతన్య పరస్పర అంగీకారంతో కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేసింది.  గత కొన్ని రోజుల నుంచి నిహారిక ,చైతన్య విడిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటీవల మెగా వారి ఇంట్లో జరిగిన అన్ని ఫంక్షన్లలో నిహారిక సింగిల్ గా హాజరవ్వడం, చైతన్య కనిపించకపోవడంతో ఈ గాసిప్ లు నిజమేనని వాదన వినిపించింది.  ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ నిహారికకు కోర్టు విడాకులు మంజూరు అయిన  డాక్యుమెంట్స్ ప్రత్యక్షం కావడంతో  ప్రచారానికి తెరపడింది. 

నిహారికకు, అప్పటి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కొడుకు చైతన్యకు 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లో పెళ్లి జరిగింది. నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.