Nikhat zareen : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిఖత్.. వరుసగా రెండోసారి

Nikhat zareen : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిఖత్.. వరుసగా రెండోసారి

భారత బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున వరుసగా రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. 50 కేజీల విభాగం ఫైనల్ లో.. వియత్నాం బాక్సర్ న్యూయెన్ పై విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పవర్ పంచ్ లతో విరుచుకుపడ్డ నిఖత్.. గోల్డ్ మెడల్ దక్కించుకుంది.  దీంతో  మేరీకోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.

గతేడాది కూడా నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. నిన్న (మార్చి 25) భారత బాక్సర్లు నీతూ, స్వీటీ కూడా బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన నిఖత్ ఈ ఏడాది జరిగే ఆసీయా క్రీడలకు అర్హత సాధించింది.