కృష్ణుడి మాయా ప్రపంచంలోకి ‘కార్తికేయ’

కృష్ణుడి మాయా ప్రపంచంలోకి ‘కార్తికేయ’

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా కార్తికేయ 2 రిలీజ్ డేట్  ఫిక్సయింది. తొలి పార్ట్ ను తెరకెక్కించిన చందు మొండేటి సీక్వెల్ కూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ అనౌన్స్ చేస్తూ సినిమా యూనిట్ వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. శ్రీ కృష్ణుడు, ఆయనకు సంబంధించిన కథలో డాక్టర్ కార్తికేయ ఎంటరవుతూ కనిపిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ మూవీ మరింత ఆసక్తిని పెంచుతోంది. గతంలో వచ్చిన కార్తికేయ‌ సినిమా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంతో సీక్వెల్ పైనా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే వరుస అప్‌డేట్స్‌తో హైప్ పెంచుతూ వచ్చారు మేకర్స్. 

కరోనా, లాక్ డౌన్ పరిస్థుతుల కారణంగా కాస్త ఆలస్యమైన కార్తికేయ 2 మూవీ.. ఎట్టకేలకు జులై 22న విడుదలవుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నిఖిల్‌కు జంట‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ముగ్ధ పాత్రలో ఆమె కనిపించే రోల్ సినిమాకు కీలకం కానుందట. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష, వెంక‌ట్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని వార్తల కోసం:

కేసీఆరే రైతుల మెడ మీద కత్తి పెడ్తుండు

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు