- అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) హస్పిటల్ డాక్టర్లు మరోసారి అరుదైన ఘనతను సాధించారు. కేవలం 10 గంటల వ్యవధిలో మూడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి, ముగ్గురు పేషెంట్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ సర్జరీల్లో ఒక రోగికి జీవించి ఉన్న దాత నుంచి కిడ్నీ అమర్చగా, మిగిలిన ఇద్దరికి బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి సేకరించిన కిడ్నీలను ఉపయోగించారు. ప్రస్తుతం ముగ్గురు పేషెంట్ల ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని నిమ్స్ డాక్టర్లు తెలిపారు
క్లిష్టమైన సర్జరీల్లో అద్భుత నైపుణ్యం
ఈ మూడు సర్జరీలు అత్యంత సవాలుతో కూడుకున్నవి. కిడ్నీ గ్రహితలు ముగ్గురూ ఒబెసిటీ(ఊబకాయం)తో బాధపడుతుండటం వల్ల శస్త్రచికిత్స సంక్లిష్టంగా మారింది. సాధారణంగా కిడ్నీకి ఒకే రక్తనాళం ఉంటుంది. కానీ ఒక బ్రెయిన్ డెడ్ దాత నుంచి సేకరించిన కిడ్నీకి మూడు రక్తనాళాలు (ధమనులు) ఉండటం డాక్టర్లకు మరింత సవాలుగా మారింది. అయినప్పటికీ, నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు తమ అపార అనుభవం, నైపుణ్యంతో ఈ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సర్జరీలతో 2025లో నిమ్స్ యూరాలజీ విభాగం చేసిన కిడ్నీ మార్పిడి సర్జరీల సంఖ్య 141కి చేరింది. కిడ్నీ మార్పిడితో పాటు నిమ్స్ యూరాలజీ విభాగం రోబోటిక్ సర్జరీలలోనూ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. గత రెండేండ్లలో 400 రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. కాగా..నిమ్స్ వైద్యులు సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమ
