హైదరాబాద్ నిమ్స్లో ఎంహెచ్ఎం కోర్సు.. దరఖాస్తు తేదీ పొడిగింపు

హైదరాబాద్ నిమ్స్లో ఎంహెచ్ఎం కోర్సు.. దరఖాస్తు తేదీ పొడిగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నిమ్స్​లో ఎంహెచ్ఎం (మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్) కోర్సుకు దరఖాస్తు తేదీని పొడిగించినట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల కోర్సు తర్వాత ఆర్నెల్ల పాటు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందని, 20 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ కలిగిన అభ్యర్థులు జులై 10 సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకొని, డాక్యుమెంట్లను జులై 14 లోపు ఆసుపత్రిలో ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు nims.edu.in లేదా 040-23489189ని సంప్రదించాలన్నారు.

ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.5వేలు (ఓసీ/బీసీ/
ఈడబ్ల్యూఎస్), రూ.4 వేలు (ఎస్సీ/ఎస్టీ)
ప్రవేశ రుసుము: రూ.5 వేలు
సెక్యూరిటీ డిపాజిట్: ₹1000 (రిఫండబుల్)
ట్యూషన్ ఫీజు: ₹26,250 (ప్రతి సెమిస్టర్)