నిఫా అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు బంద్

నిఫా అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు బంద్

కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మొదలైన అన్ని విద్యా సంస్థలు సెప్టెంబర్ 14, 15 తేదీలలో మూసివేయనున్నారు. "అన్ని సంస్థలకు సెలవు ప్రకటించబడింది. ఇది అంగన్‌వాడీలు, మదర్సాలు, ప్రొఫెషనల్ కాలేజీలకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రాణాంతకమైన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అధికారులు వెల్లడించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, పరీక్ష తేదీలలో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజుల్లో విద్యా సంస్థలు ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

నిఫా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి మొత్తం ఐదుగురు రోగులు వైరస్ బారిన పడ్డారని నివేదికలు సూచిస్తున్నాయి. కోజికోడ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త కు పాజిటివ్ రాగా.. వైరస్ సోకిన మొత్తం ఐదుగురిలో ఇద్దరు మరణించారు.