బీఆర్ఎస్​కు పూర్తి మెజార్టీ వస్తుంది: నిరంజన్​రెడ్డి

బీఆర్ఎస్​కు పూర్తి మెజార్టీ వస్తుంది: నిరంజన్​రెడ్డి

జడ్చర్ల టౌన్​, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి నిరంజన్​రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం జడ్చర్లలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామ్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హంగ్​ వస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. హంగ్​ లేదు.. ఏమిలేదు.. అన్ని స్థానాల్లో గెలిచి పూర్తి మెజార్టీ సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు పంటల దిగుబడి పెరిగిందన్నారు.  గతంలో 4 లక్షల మెట్రిక్​ టన్నుల కెపాసిటీ గోదామ్​లు ఉండేవని, ఇప్పుడు 70 లక్షల మెట్రిక్​ టన్నుల గోదామ్​లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​ సుదర్శన్​ గౌడ్​ పాల్గొన్నారు.

శ్రీరంగాపూర్: మండలంలోని నాగసానిపల్లి నుంచి మండల కేంద్రం వరకు, నాగరాల రెండో సెంటర్​ నుంచి మూడో సెంటర్​ వరకు రూ.2.60 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం మంత్రి నిరంజన్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జడ్పీ చైర్మెన్​ లోక్​నాథ్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి పృథ్వీరాజ్, సర్పంచులు వినీలారాణి, నిర్మల, రాధకృష్ణ, ఆంజనేయులు, గౌడ నాయక్, ఆరీఫ్,​​ మహేశ్​గౌడ్, శివసాగర్, నరేశ్​నాయుడు, సంపత్​నాయుడు పాల్గొన్నారు.