పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ​పాల్గొన్నారు. బాలలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి స్కూల్ స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు.

 ఎంఈఓలు మండలాల వారీగా ప్రతి స్కూల్​లో ఈ చట్టంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణుడు డేవిడ్ రాజు పోక్సో చట్టం, స్కూళ్ల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీవాణి, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, డీఈవో రామారావు, స్కూళ్ల హెచ్​ఎంలు, అధికారులు పాల్గొన్నారు.