రూల్స్ పాటించని హాస్పిటల్స్​పై చర్యలు : ఆశిష్ సంగ్వాన్

రూల్స్ పాటించని హాస్పిటల్స్​పై చర్యలు : ఆశిష్ సంగ్వాన్

నిర్మల్, వెలుగు: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ ​జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ -2010 నిబంధనలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగిన అర్హతలు లేకుండా వైద్యం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్​ధనరాజ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్, డిప్యూటీ వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్ తదితరులు పాల్గొన్నా రు.