సర్పంచ్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌.. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎర్వచింతల్‌‌‌‌‌‌‌‌ లో ఘటన

సర్పంచ్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌.. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎర్వచింతల్‌‌‌‌‌‌‌‌ లో ఘటన
  •     ఇటీవలే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరిన భార్యాభర్తలు
  •     కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల ఒత్తిడే కారణమని పోలీసులకు ఫిర్యాదు

ఖానాపూర్, వెలుగు : నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎర్వచింతల్‌‌‌‌‌‌‌‌ గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి బండారి పుష్ప భర్త రవీందర్ (54) గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల ఒత్తిడి కారణంగానే రవీందర్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బండారి రవీందర్‌‌‌‌‌‌‌‌, పుష్ప దంపతులు గత నెల 29న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాజీనామా చేసి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. 

తర్వాత సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా పుష్ప నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తెల్లవారుజామున తన ఇంటి ముందున్న పశువుల షెడ్‌‌‌‌‌‌‌‌లో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించే సరికే చనిపోయి కనిపించాడు. కాగా, తాము బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరిన తర్వాత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేతలు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి తిరిగి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని, అలా వస్తే ఏకగ్రీవం చేస్తామని ఒత్తిడి చేశారని రవీందర్‌‌‌‌‌‌‌‌ భార్య పుష్ప ఆరోపించారు. 

పుష్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. రవీందర్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి భుక్యా జాన్సన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నాయకులు ఎర్వచింతల్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చేరుకొని రవీందర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవీందర్‌‌‌‌‌‌‌‌ మృతిపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరంసీఐ అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.