రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : అశోక్ నేత

రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : అశోక్ నేత

కడెం, వెలుగు: రాష్ట్రంలో ఈసారి బీజేపీ జెండా ఎగరేస్తుందని మహారాష్ట్ర గడ్చిరోలి ఎంపీ, బీజేపీ నిర్మల్ జిల్లా సంఘటనా ఇన్ చార్జ్ అశోక్ నేత ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ నేతలతో ఆయన కడెం మండలంలోని హరిత రిసార్ట్స్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు స్థానాల్లోనూ బీజేపీ గెలుపొందుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీని గెలిపించడం ఖాయమన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్, కడెం మండల అధ్యక్షుడు ధర్మాజీ కిష్టయ్య, పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.