396 మంది సర్పంచులం రాజీనామాలు చేస్తాం

396 మంది సర్పంచులం రాజీనామాలు చేస్తాం

కేసీఆర్ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఇటీవల అసిఫాబాద్ జిల్లాలో 18 మంది బీఆర్ఎస్ సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా చేయగా..లేటెస్ట్ గా  నిర్మల్ జిల్లా సర్పంచులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మూడు రోజుల్లో బిల్లు చెల్లించకపోతే 396 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ భార్యల మెడల పుస్తెలు అమ్మి.. గ్రామాల్లో పనులు చేశామని సర్పంచులు వాపోయారు. అప్పులు మాకు అవార్డులు సర్కారుకా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు తీరుపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని వారం రోజులుగా ఆందోళన చేపట్టిన సర్పంచులు ఇప్పుడు కేసీఆర్ పై తిరగబడుతున్నారు. నిధులు దారి మళ్లింపును నిరసిస్తూ రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది బీఆర్ఎస్ సర్పంచులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియకుండానే మళ్లిస్తున్నారని .. ఏజెన్సీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు.